తమిళ స్టార్ సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్‌కు డేట్ ఖరారైంది. HYDలోని AMB సినిమాస్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, బాబీ డియోల్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషించారు.