GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు రాజీవ్ గృహకల్పలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించి పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.