భారత్లో ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. హసీనాకు చెందిన రాజకీయ పార్టీ ‘అవామీ లీగ్’ అనుబంధ విద్యార్థి సంఘం ‘బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్’పై నిషేధాన్ని విధించింది. జులై నుంచి ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న ఎంతోమంది విద్యార్థుల మరణాలకు కారణమైనందున సదరు విద్యార్థి సంఘంపై బ్యాన్ విధిస్తున్నట్లు బంగ్లా సర్కారు తెలిపింది.