TG: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ పెట్టారు. ఇకపై పార్కుకు వాకింగ్‌కు వచ్చేవారు తమ వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయకూడదని హెచ్చరించారు. ఉదయం, సాయంత్రం వేళ్లలో కేబీఆర్ పార్కు కు వచ్చే వాకర్లు, సందర్శకులు రోడ్లపై వాహనాలను నిర్దేశించిన సమయాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించడం తప్పదన్నారు.