మహిళ తన శరీరాన్ని ఏం చేయాలనే దానిని ప్రభుత్వం చెప్పకూడదని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా తన వైఖరి స్పష్టమని చెప్పారు. అబార్షన్ హక్కులపై కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సంతోషంగా సంతకం చేశానని చెప్పుకొచ్చారు. అబార్షన్ విషయంలో మహిళలు ఏం చేయాలో చెప్పకూడదన్నారు. ఈ చట్టాలతో చాలామంది ఇబ్బందులు పడటం చూశానని.. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.