TG: కాంగ్రెస్ సీనియర్ నేత, MLC జీవన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. పార్టీలో ఉండలేనని మహేష్‌కు జీవన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. కాగా, అంతకుముందు విప్ లక్ష్మణ్‌తో జీవన్ రెడ్డి పార్టీలో ఉండలేనని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.