కృష్ణా: జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మాదలవారిగూడెంకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు ఆదివారం కావడంతో స్నానానికి వెళ్లారు. క్వారీ గుంతలో ఏడుగురు ఈతకు వెళ్లగా.. సెల్ఫీలు తీసుకుంటూ అందరూ గల్లంతయ్యారు. వారిలో దుర్గాప్రసాద్, వెంకటేశ్ అనే విద్యార్థులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.