AP: ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడుతుంది. పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుంది. ఈనెల 24, 25 తేదీల్లో తేలికపాటి, మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 24 వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.