జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం పలు రికార్డులు సొంతం చేసుకోగా.. తాజాగా ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫైలో ఈ మూవీ సెన్సేషనల్ రికార్డు సాధించినట్లు తెలుస్తోంది. నాలుగు పాటలు కలిగిన ఈ ఆల్బమ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్స్ దాటినట్లు సమాచారం.