AP: విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ‘లా అండ్ ఆర్డర్ బాధ్యత పోలీసులదే. టెక్నాలజీని పోలీసులు సమర్థవంతంగా ఉపయోగించాలి. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపు చేయాలి. నేరాలు చేస్తే రౌడీలకు అదే చివరి రోజు కావాలి. పోలీసు వ్యవస్థపై దృష్టి పెడతాం. కొత్త ఆయుధాలు సమకూరుస్తాం. రూ.100 కోట్ల బిల్లులను క్లియర్ చేశాం’ అని తెలిపారు.