బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ 2’ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు తెలుగులో వేరే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘యుద్ధభూమి’ అని పెడుతున్నారట. మరోవైపు ఈ మూవీ టైటిల్ మారడం లేదని, తెలుగులో కూడా ‘వార్ 2’ పేరుతోనే ఇది విడుదల కానున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 2025 ఆగస్టు 15న విడుదల కానుంది.