AP: కడప జిల్లా బద్వేల్లో ఇంటర్ విద్యార్థినిపై జరిగిన హత్య ఘటనపై ఎస్పీ హర్షవర్థన్ కీలక విషయాలు వెల్లడించారు. ప్లాన్ ప్రకారమే నిందితుడు విద్యార్థినిపై దాడి చేశాడని పేర్కొన్నారు. ‘చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. చనిపోతానని బెదిరించడంతో ఆ అమ్మాయి అతడిని కలవడానికి వెళ్లింది. ఇష్టపూర్వకంగానే వారు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. తర్వాత అక్కడ జరిగిన వాగ్వాదంలో నిందితుడు విద్యార్థినికి నిప్పంటించాడు’ అని తెలిపారు.