SRPT: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నడిగూడెం మండలంలో సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గురుకుల పాఠశాల సందర్శన, 1 గంటలకు మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, 2 గంటలకు గ్రామపంచాయతీ భవన శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు మండలంలోని బృందావనపురంలో, 4 గంటలకు రత్నవరంలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.