AP: ఇవాళ నటి జెత్వానీ కేసు ఫైల్స్ CID అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. విజయవాడ పోలీసులు ఈ ఫైల్స్ అప్పగించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సాగిన దర్యాప్తు, ఐపీఎస్ అధికారుల పాత్రకు సంబంధించిన వివరాలను CID అధికారులు ఇదివరకే తెలుసుకున్నారు. ఈరోజు నుంచి నటి కేసుపై విచారణ చేపట్టనున్నారు. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు ఫైల్‌ను కూడా పోలీసుల నుంచి ఈ రోజు తీసుకోనున్నారు.