నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2 తాండవం’ మూవీ రాబోతుంది. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. తాజాగా ఈ సినిమాపై అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దర్శకుడు బోయపాటి ఈ మూవీలో నటించే నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టారట. కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసున్నారట.