AP: విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅథితిగా హాజరయ్యారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ నివాళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసు సంక్షేమం మా బాధ్యత. పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారు. శాంతి భద్రతలు కాపాడటంలో ఎక్కడా రాజీలేదు’ అని అన్నారు.