అన్నమయ్య: మదనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7.30 నుంచి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా పంచాయతీ అభివృద్ధి పనులకు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కావున ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.