జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైన, పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల్ని కాల్చిచంపారు. గందర్బల్ జిల్లాలో గగాంగీర్ వద్ద నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు భవన కార్మికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రతా బలగాలు దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని చుట్టుమట్టాయి.