KKD: విద్యుత్ లైన్ల మరమ్మత్తులలో భాగంగా పిఠాపురం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రభాకర్ తెలిపారు. దత్తాత్రేయుడి గుడి, కుమ్మరి వీధి, హార్వెస్ట్ స్కూల్, తారకరామా నగర్, YSRగార్డెన్, BSR గార్డెన్, బొజ్జవారి తోట, మాధపురం రోడ్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.