తూ.గో: కడియం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మండలంలోని మురమండ, కడియపులంక గ్రామాల్లో నిర్వహించే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొని నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తారన్నారు.