విజయనగరం పెద్దచెరువులో శ్రీ పైడిమాంబ తెప్పోత్సవం ట్రయల్ రన్ సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు 40 మందితో ఈ ట్రయల్ రన్ చేపడుతున్నామన్నారు. పైడితల్లి సిరిమానోత్సవం పూర్తయిన మరుసటి రోజు అయిన మంగళవారం చేపట్టే తెప్పోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.