CTR: కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కృపాలక్ష్మి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట మానభంగాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయన్నారు. తాగాజా బద్వేలులో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ అన్నారు. పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆమె విమర్శించారు.