యూపీ బీజేపీ నేత కుమారుడు పాకిస్థాన్ అమ్మాయిని ఆన్లైన్లో ‘నిఖా’ చేసుకున్నాడు. బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ కుమారుడు మొహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు లాహోర్‌కు చెందిన అంద్లీప్ జారాతో వివాహం నిశ్చయించాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా వీసా లభించలేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లోనే షాహిద్ తన కుమారుడికి పెళ్లి జరిపించాడు.