తాను 2028 లోపు మళ్లీ కర్ణాటక సీఎం అవుతానని కేంద్రమంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. ‘2028లోపు నాకు సీఎం అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రజలు కోరుకుంటే నేనెందుకు సీఎంని కాకూడదు? నేను ఐదేండ్ల పాటు సీఎంగా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా’ అని పేర్కొన్నారు.