కృష్ణ: అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. శనివారం అర్ధరాత్రి అయిన ద్విచక్ర వాహనంపై గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను బైక్పై తిరుగుతూ.. పరిశీలించారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు.