»Vangalapudi Anitha Demand For Jagan And Vanitha Resignation
vangalapudi anitha: జగన్ నీకు సిగ్గనిపించడం లేదా? రిజైన్ చేస్తే దరిద్రం పోతుంది
ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ (YS jagan), హోంమంత్రి వనిత (Thaneti Vanitha)( తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత ((Vangalapudi Anitha)) మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో జగన్ (YS Jagan) పాలనలో మూడున్నరేళ్లుగా మహిళలకు కంఠశోస మాత్రమే మిగులుతోందన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏపీలో మహిళల మనుగడే కష్టంగా మారిందన్నారు. ఆయనకు అనుభవం లేకపోవడం దానికి తోడు అసమర్థత కారణంగా ఆడబిడ్డల బతుకు దారుణంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి మత్తులో ఉండి, 17 సంవత్సరాల అంధ దళిత బాలికను అతికిరీతకంగా చంపేసిన సంఘటన మనందరినీ కలిచివేస్తోందన్నారు. ఈ ఘటనకు కొద్ది దూరంలోనే డీజీపీ ఉంటుందని గుర్తు చేశారు. ఈ హత్యపై సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధులుగా తాము సిగ్గుపడుతున్నామన్నారు.
ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి
పాదయాత్ర (Padayatra) సమయంలో అధికారంలోకి రావడానికి ఆడపిల్లలకు ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి.. మహిళల కోసం దిశ చట్టాన్ని తీసుకు వస్తానని, 21 రోజుల్లో నేరస్తులకు ఉరి వేస్తామని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎక్కడా కనీస న్యాయం చేయలేకపోయారన్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలను చూసి, జగన్‌కు సిగ్గనిపిస్తుందో లేదో తెలియదు కానీ… ఆయనను సీఎం అని చెప్పుకోవడానికి మా అందరికి మాత్రం సిగ్గుగా ఉందన్నారు. ఇలాంటి ఘటన ఇదే మొదటిది కాదని, రెండేళ్ల క్రితం ఓ యువతి తనకు కాబోయే భర్తతో మాట్లాడుకుంటూ ఉండగా.. గంజాయి (Ganja() బ్యాచ్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేస్తే, ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారని ధ్వజమెత్తారు.
జగన్ ఏం చేయలేకపోతున్నావా?
తాడేపల్లి కొంప చుట్టూ కూడా తాలిబన్ల కంటే చాలా ప్రమాదకర మనుషులు గంజాయి, డ్రగ్స్ మత్తులో తిరుగుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో కనీసం పోలీస్ రక్షణ లేకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే కారణమెవరో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ ఏం చేయలేకపోతున్నారా అని నిలదీశారు. రమ్య, స్నేహలత, తేజస్విని, శ్రీలక్ష్మి.. ఈరోజు ఎస్తేరు రాణి… ఇలా ఎంతమంది మహిళలు బలి కావాలన్నారు. ఇంత జరుగుతుంటే జగన్ క్యాంప్ హౌస్‌లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారా.. ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. అసలు పబ్జీ ఆడుతున్నాడా లేక ఎవరినైనా వేసేయాలా అని ప్లాన్ చేస్తున్నాడా తెలియడం లేదన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాస్త గంజాయి రాష్ట్రంగా మారిందన్నారు. 2019 నుండి 2021 వరకు మాదకద్రవ్యాలు అతి ఎక్కువగా స్వాధీనం చేసుకున్నది ఏపీలోనే అన్నారు. ఇది ఎంతో బాధాకరమన్నారు. పక్క రాష్ట్రానికి కూడా గంజా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తుందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. జగన్ ఇలాంటి దారుణాల పట్ల కనీసం సిగ్గుపడటం లేదన్నారు.
అప్పుడు అలా… ఇప్పుడు ఇలా
ఇదివరకు ఎన్ఆర్జీఎస్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఉంటే టీడీపీ ప్రభుత్వం ఆనందించేదని, కానీ ఇప్పుడు గంజా, క్రైమ్ వంటి వాటికి సంతోషిస్తున్నట్లుగా ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి లేక ఖాళీగా ఉన్న పిల్లలు గంజాయి సేవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్, దాని ద్వారానే సంపాదన ప్రారంభించారని మండిపడ్డారు. జగన్ ధనదాహానికి, తన ట్రంక్ పెట్టెలు నింపుకోవడానికి తాపత్రయపడుతున్నాడని, ఇందుకు ఢిల్లీ సాక్షిగా సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. జగన్‌కు ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అన్నారు. ఆయన మహిళల విషయంలో తన సైకో విషయాన్ని చూపిస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలపై డీజీపీ అపాయింటుమెంట్ అడిగినా ఇవ్వడం లేదన్నారు. తెలుగు మహిళలకు భయపడి డీజీపీ కార్యాలయం చుట్టూ పోలీసులను మోహరించారని విమర్శించారు. ఆయన వైసీపీకి మాత్రమే డీజీపీ కాదని గుర్తుంచుకోవాలన్నారు. డీజీపీ తమ పని తాము చేయాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించే చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.