KDP: సిద్దవటం మండలంలోని టక్కోలి గ్రామ సచివాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి శనివారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన దిశగా విధులకు హాజరు కావాలని, విధుల నిర్లక్ష్యంలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. పంచాయతీలో అపరిశుభ్రత ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టాలని ఆమె సూచించారు.