AP: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ MLC బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనుకున్నామని, ఢిల్లీ వెళ్లివచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలపై చంద్రబాబు మాట్లాడుతున్నారని, రెండున్నరేళ్లలోనే ఎన్నికలు వస్తాయంటే తమ కార్యచరణ మార్చుకుంటామని చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.