PPM: పార్వతీపురం డివిజన్ పరిధిలో ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభికా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిది 8 మండలాల అధికారులతో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్డ్ ప్రకారం పక్కాగా గ్రామ సభలు నిర్వహించాలన్నారు.