ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లోని మొహందిలో మావోయిస్టులు మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ITBP జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు మృతిచెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులను మహారాష్ట్రలోని సతారాకు చెందిన అమర్ పన్వర్ (36), ఏపీలోని కడపకు చెందిన కే రాజేశ్ (36)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.