Vsp: భీమిలి జోన్లో 2,3 వార్డులలో జీవీఎంసీ కమిషనర్ సాయిసంపత్ శనివారం పర్యటించారు. కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి , ప్రధాన ఇంజినీరు శివప్రసాదరాజు, జోనల్ కమిషనరు ప్రేమ ప్రసన్న వాణిలతో కలిసి వార్డులో సమస్యలు తెలుసుకున్నారు. భీమిలి జోన్ నోవోటల్ ఎదురుగా అలల తాకిడికి రోడ్డు కోతకు గురవడంతో వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ఆదేశించారు.