Vsp: విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఈస్ట్ ఏసీపీ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంచుతూ మొత్తం ప్రశాంతంగా ఉండేలా ఇప్పటికే పలు క్రైమ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా సీపీ సీపీ ఈస్ట్ సబ్ డివిజన్ అధికారులు, సిబ్బంది యొక్క విధులను సమీక్షించారు.