GST రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కొన్ని వస్తువులపై GST తగ్గించాలని నిర్ణయించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్‌పై 18 శాతం వసూలు చేస్తుండగా 5 శాతానికి, రూ.10 వేలలోపు సైకిళ్లపై 12 శాతం ఉండగా 5 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించారు. నోట్ బుక్స్‌పైనా GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయాలను GST కౌన్సిల్ ఆమోదిస్తే ఊరట కలగనుంది.