జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 66 మందితో BJP అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ధన్వార్ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ బరిలోకి దిగనున్నారు. అలాగే, జామ్తాడా నుంచి సీతా సోరెన్, సరాయ్కెలా నుంచి మాజీ CM చంపై సోరెన్ పేర్లు ఖరారు చేశారు. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. అలాగే, 23న ఫలితాలు వెలువడనున్నాయి.