బెంగళూరు టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 99 పరుగుల దగ్గర అవుటై తృటిలో సెంచరీ కోల్పోయాడు. అంతేకాకుండా గత ఆరేళ్లలో అతడు 90-99 రన్స్ చేసి ఏడో సారి అవుటయ్యాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 90ల్లో అవుటైన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ 10 సార్లు, ద్రవిడ్ 9 సార్లు 90ల్లో అవుటయ్యారు. మరోవైపు 99 వద్ద అవుటైన 10వ భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.