కామారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు గదులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 25 లక్షలతో నిర్మించి తలపెట్టిన అదనపు గదుల నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, సత్యనారాయణ ఉన్నారు.