AP: రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శారదాపీఠానికి షాకిచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఠానికి ఇచ్చిన స్ధలం అనుమతులను రద్ధు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే రూ.15 లక్షలకే ఇచ్చినట్లు సమాచారం. ఈ స్థలంపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి.. నివేదిక ఆధారంగా అనుమతులు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండపై శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.