AP: వైసీపీ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయంపై గవర్నర్‌కు వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, MLC రుహుల్లా తదితరులు ఉన్నారు.