E.G: నిడదవోలు సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్ఐ అప్పారావు, పెరవలి స్టేషన్ రైటర్, పెరవలి కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరవలి మండలం ముక్కామల గ్రామ పరిధిలో సెప్టెంబర్ 8వ తేదీన జరిగిన ఓ పేకాట శిబిరంపై దాడి చేసి కేసులో అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ కేసును తప్పుదోవ పట్టించడంతో సస్పెండ్ చేశారు.