SDPT: సిద్దిపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కమిషనర్ అశ్రిత్ కుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ వనితతో కలిసి పర్యటించారు. ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన స్లాటర్ హౌజ్లో మాత్రమే మేకలను, గొర్రెలను వధించాలని అన్నారు. డాక్టర్లు ముద్ర వేసిన తర్వాతనే మాంసాన్ని మార్కెట్లో విక్రయించాలని మాంసం విక్రయదారులకు సూచించారు.