TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ ఆందోళనకు దిగారు. సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రికి సీఎం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.