హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ సూరి తెరకెక్కించిన మూవీ ‘బఘీర’. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 21న ఉదయం 9:36 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ కథను అందించగా.. కన్నడ హీరో శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.