యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ఉదాహారణకు ‘జై లవ కుశ’ చిత్రంలోని ‘జై’ పాత్రనే చెప్పొచ్చు. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న రావణ్ పాత్రలో దుమ్ముదులిపేశాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి పవర్ ఫుల్ రోల్లో ఎన్టీఆర్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తారక్ విలనిజానికి థియేటర్లు షేక్ అయిపోవడం ఖాయం. పైగా అది ప్రశాంత్ నీల్ సినిమాలో అంటే.. ఊహకందని ఊచకోతేనని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనే లేదు.. అప్పుడే ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అందులోభాగంగా ఈ సినిమాను భారీ పీరియాడిక్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడట. అది కూడా హీరోగా, విలన్‌గా ఎన్టీఆరే కనిపించనున్నాడని టాక్. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సలార్‌ను 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నారు. దాంతో వచ్చే ఏడాది సమ్మర్లో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రశాంత్ నీల్. ఏదేమైనా ఎన్టీఆర్ విలన్‌గా కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలవడంలో ఎలాంటి సందేహం లేదు.