»Prime Minister Modi Inaugurated Dayanand Saraswati Celebrations
Dayanand Saraswati : దయానంద్ సరస్వతి వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ
స్వామి దయానంద్ సరస్వతి (Dayanand Saraswati) 200వ జయంతి వేడుకలను ఆదివారం ( New delhi) న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారింభించారు. ఈ నేపథ్యంలో నే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
స్వామి దయానంద్ సరస్వతి (Dayanand Saraswati) 200వ జయంతి వేడుకలను ఆదివారం ( New delhi) న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారింభించారు. ఈ నేపథ్యంలో నే అంతకముందు దయానంద్ సరస్వతి గురించి పేర్కొంటూ ప్రధాన మంత్రి కార్యలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘ 2023 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని (Indira Gandhi) ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి స్మారక సంవత్సర వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా సభను ఉద్దేశించి ప్రసంగిస్తార’ని పేర్కొంది. ఇంకా ‘1824 ఫిబ్రవరి 12న జన్మించిన మహర్షి దయానంద్ సరస్వతి, అప్పటికి ప్రబలంగా ఉన్న (Social inequalities) సామాజిక అసమానతలను ఎదుర్కోవడానికి 1875లో ఆర్యసమాజ్‌ని స్థాపించిన సంఘ సంస్కర్త. మహర్షి దయానంద్ సరస్వతి, ఒక సంఘ సంస్కర్త. దేశ సాంస్కృతిక, సామాజిక జాగృతిలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది.
ఈ నేపథ్యంలోనే మోడీ ఆధ్వర్యంలోని (Central Govt )కేంద్ర ప్రభుత్వం.. సంఘ సంస్కర్తలు, ప్రముఖ వ్యక్తులకు, ప్రత్యేకించి భారతదేశ స్థాయిలో వారికి దక్కని గుర్తింపును అందజేసేందుకు కట్టుబడి ఉన్నార’ని కూడా ప్రధాని కార్యాలయం తెలిపింది. అంతేకాక ‘బిర్సా ముండా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం నుంచి అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని ఒక కార్యక్రమంలో పాల్గొనడం వరకు, మోదీ ఇటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నార’ని ప్రకటన ప్రస్తావించింది.1824, ఫిబ్రవరి 12న జన్మించిన మహర్షి దయానంద్ సరస్వతి ఒక (Social reformer) సంఘ సంస్కర్త. అతను 1875లో అప్పటి ప్రబలంగా ఉన్న సామాజిక అసమానతలను ఎదుర్కోవడానికి (Arya Samaj) ఆర్యసమాజ్‌ని స్థాపించాడు. ఆర్యసమాజ్ సామాజిక సంస్కరణలు మరియు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశం యొక్క సాంస్కృతిక మరియు సామాజిక మేల్కొలుపులో కీలక పాత్ర పోషించింది.
(Social reformers“) సాంఘిక సంస్కర్తలు మరియు ముఖ్యమైన వ్యక్తులను సెలెబ్రేట్ చేసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేకించి దేశానలుమూలల ఇంకా చేరని గొప్ప వ్యక్తుల గురించి, అందరికి తెలియజేప్పే కార్యక్రమాలు చేస్తున్నాం. భగవాన్ బిర్సా ముడా జన్మదినాన్ని జనజాతీయ (Gaurav Divas) గౌరవ్ దివస్‌గా ప్రకటించడం నుండి (Sri Aurobindo) శ్రీ అరబిందో 150వ జయంతిని స్మరించుకునే కార్యక్రమంలో పాల్గొనడం వరకు ప్రధాని మోదీ ఇటువంటి కార్యక్రమాలకు ముందు ఉండి నాయకత్వం వహిస్తున్నారు” అని తెలిపారు. దయానంద సరస్వతి చిన్నతనం నుంచే సమాజంలో అసమానతలపై ప్రశ్నించేవారు. సమాజంలో పరివర్తన తేవాలని తపించేవారు. జాతిని జాగృతం చేయాలని భావించారు. తన ఆలోచనలకు అనుగుణంగా ఆర్యసమాజ్ అనే సంస్థను స్థాపించారు. సాంఘిక సంస్కర్తలు, సమాజ సేవకుల జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా గతంలో దక్కాల్సినంత ఖ్యాతి దక్కని వారి జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలని మోడీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని ప్రధాని కార్యాలయం తన ట్వీట్ ద్వారా వెల్లడించింది.