ys sharmila:విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయండి: షర్మిల
ys sharmila:రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. జనగామ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. విద్యుత్ (power) మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సర్ ప్లస్ స్టేట్ అయితే 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇందుకు సీఎం కేసీఆర్ (kcr) మిస్ మేనెజ్ మెంట్ కారణం అని మండిపడ్డారు.
ys sharmila:రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. జనగామ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. విద్యుత్ (power) మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సర్ ప్లస్ స్టేట్ అయితే 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇందుకు సీఎం కేసీఆర్ (kcr) మిస్ మేనెజ్ మెంట్ కారణం అని మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. 24 గంటల కరెంట్ 924 hours power) అని 5 గంటలు కూడా ఇస్తలేరని చెప్పారు. పవర్ కొనడం తప్పా జెనరేట్పై కేసీఆర్‌కు అవగాహన లేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలు (power cuts) ఉన్నాయని వివరించారు.
కేసీఆర్‌కు ప్లాన్ లేదు..
యాసంగి సీజన్‌పై సీఎం కేసీఆర్‌కు (cm kcr) ప్లానింగ్ లేదని చెప్పారు. 26 లక్షల మోటర్ల కింద 50 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయని.. 24 గంటలు కరెంట్ అవసరం అవుతుందని తెలిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ 5 గంటలు (5 hours) కూడా కరెంట్ అందడం లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని కేసీఅర్ ఊదర గొడుతున్నారే తప్ప నిజం కాదన్నారు. 24 గంటల పవర్ ఉంటే రైతుల ఫోన్లకు ఎందుకు మెసేజ్ వస్తున్నాయని అడిగారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు (farmers) ఆందోళన చెందుతున్నారు. గజ్వేల్‌లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. రైతులు ఆందోళన కేసీఅర్ అండ్ కో కళ్ళకు కనిపించడం లేదా అని అడిగారు.
నోరు విప్పరేం?
కరెంట్ కోతలపై (power cuts) ప్రభుత్వం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతూ.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడే కాదు తొలి నుంచి కేసీఆర్ (kcr) కరెంట్ (power) విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని షర్మిల (sharmila) ధ్వజమెత్తారు. సర్ ప్లస్ స్టేట్ అని.. రెప్పపాటు కరెంట్ పోదని అంటున్నారు. న్యూయార్క్, లండన్, ప్యారిస్‌లో కరెంట్ పోయినా తెలంగాణలో పోదని గారడీ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను దివాళా తీయించాడని చెప్పారు. విద్యుత్ వాడకం విషయంలో మిస్ మ్యానేజ్ మెంట్ ఎక్కువ జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే 5 వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టాల్సి ఉందని చెప్పారు. SPDCL,NPDCL కంపెనీలను దివాళా తీయించాడని మండిపడ్డారు. ఆ కంపెనీల బ్యాలెన్స్ షీట్ చూస్తే 2021 వరకు 43 వేల కోట్ల నష్టంలో ఉందన్నారు. NPDCL నష్టాలు 19 వేల కోట్లు, SPDCL 21 వేల కోట్లు నష్టంలో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు వరకు నష్టం 50 వేల కోట్లు దాటిందన్నారు.
నష్టాలు మాత్రం చెల్లించరు
నష్టాలు చెల్లించకుండా 16 వేల కోట్లు కరెంట్ బిల్లుల (bills) రూపంలో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ పంపిణీ సంస్థలు మూట కట్టుకున్నాయని వివరించారు. 2014 వరకు కేవలం 9 వేల కోట్ల నష్టాలు మాత్రమే ఉండేవని తెలిపారు. కేసీఆర్ (kcr) అధికారం చేపట్టిన తర్వాత అవి 43 వేల కోట్లకు చేరాయని వివరించారు. దీనిని దివాళా తీయడం అనరా… మిస్ మ్యానేజ్ మెంట్ అనరా..? అని అడిగారు. రాష్ట్రంలో ఇక కరెంట్ (power) కొనే పరిస్థితి లేదన్నారు. డొమెస్టిక్ పవర్ వినియోగంపై కూడా కోతలు విధిస్తారని చెప్పారు. ఇప్పటికే అప్రకటిత కోతలు విధిస్తున్నారని చెప్పారు.కేసీఆర్‌కి విద్యుత్‌పై ఏ మాత్రం అవగాహన లేదన్నారు. అవసరాలకు ఎందుకు ఉత్పత్తి చేసుకోలేక పోతున్నాం అని అడిగారు.
మూడింతలు పెట్టి
యూనిట్‌కి 12 రూపాయలు (rs.12) పెట్టి కోనాల్సిందేనా..? అని అడిగారు. ఉత్పత్తి చేస్తే 4 రూపాయలు ఖర్చు అవుతుందని.. మూడింతలు పెట్టి కొనాల్సి వస్తోందని చెప్పారు. పవర్ తక్కువ…డిస్ట్రిబ్యూటర్ లైన్స్ మాత్రం ఎక్కువ అన్నారు. పవర్ జనరేషన్ మీద కేసీఆర్ ఫోకస్ లేదన్నారు. నీళ్ళు లేవు కానీ..పైపులు వేసుకొని కూర్చున్నట్లు ఉంది కేసీఆర్ తీరు అని విమర్శించారు. రాష్ట్ర సంపాదనను అనవర ఖర్చులకు తగలేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaaleshwaram project) కోసం తీసుకున్న అప్పు కింద ప్రతి ఏడాది 13 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి, కొనుగోలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని షర్మిల (sharmila) డిమాండ్ చేశారు.