Gorantla Buchibabu:14 రోజుల జ్యుడిసీయల్ కస్టడీకి బుచ్చిబాబు
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ (Telangana) నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే.
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఎమ్మెల్సీ కవిత (Kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (Gorantla Buchibabu) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ (Telangana) నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత ఈడీ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే. కేసు విచారణలో భాగంగా బుచ్చిబాబు నుంచి మరింత సమాచారం తీసుకునేందుకు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. బుచ్చిబాబు లిక్కర్ పాలసీ కుట్రలో భాగస్వామి అని పేర్కొన్నారు. సహ నిందితులతో కలిసి సమావేశం అయ్యారని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోరింది. బెయిల్ కోసం దరఖాస్తు చేయడం లేదని బుచ్చిబాబు తరఫు న్యాయవాది కోరారు. మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అడిగారు.
విచారణకు పిలిచి.. అరెస్ట్
విచారణ కోసం బుచ్చిబాబును సీబీఐ ఢిల్లీకి 8వ తేదీన పిలిపించి, అదేరోజు రాత్రి అరెస్టు చేసింది. గతంలో కూడా సీబీఐ, ఈడీ బుచ్చిబాబును ప్రశ్నించాయి. బుధవారం బుచ్చిబాబును సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు శనివారం వరకు కస్టడీ విధించింది. పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ విధానం, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారట. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్సీలకు, వారి ద్వారా ప్రయోజనం పొంది.. అక్రమ లాభాలు సమకూరాయని సీబీఐ తెలిపింది. కవిత జాగృతి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె ఆడిటర్‌గా బుచ్చిబాబు ఉన్నారు.
కీ రోల్
మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50(2),(3) కింద బుచ్చిబాబు నుంచి ఇప్పటికే సమాచారం తీసుకున్నామని గత నెలలో దాఖలు చేసిన చార్జిషీటులో ఈడీ పేర్కొంది. బుచ్చిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం పాలసీ ముసాయిదా ప్రతిని రూపొందించడం నుంచి శరత్ చంద్రారెడ్డి, (sharath chandra reddy) మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) మద్యం వ్యాపారంలో ప్రవేశపెట్టే వరకు కీ రోల్ పోషించారు. 2021 జూన్‌లో బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైతో కలిసి ఢిల్లీలో గల విజయగౌరి అపార్ట్మెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌తో చర్చలు జరిపారు. తర్వాత ఐటీసీ కోహినూర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, తాజ్మన్సింగ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కీలక సమావేశాల్లో కూడా పాల్గొన్నారు.
రాఘవరెడ్డి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (YCP MP Magunta Srinivasula Reddy) కుమారుడు మాగుంట రాఘవరెడ్డి (Raghav Reddy)ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లో మాగుంట పాల్గొన్నట్టు తెలిసింది. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి (Rajesh Joshi) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
9 మంది అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా.. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషిను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.