»I Still Remember The Days Of Studying After Killing Hunger President
President Draupadi Murmu : ఆకలిని చంపుకొని చదువుకోన్న రోజులు ఇంకా గుర్తున్నాయి : రాష్ట్రపతి
చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదుకున్నని రాష్ట్రతి (Rashtrath) ద్రౌపది ముర్ము తన చిన్నటి జ్ఞాపకాలను విద్యార్దులతో పంచుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) లోని రమాదేవీ మహిళా యూనివర్సటీ స్నాతకోత్సంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.
చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదుకున్నని రాష్ట్రతి (Rashtrath) ద్రౌపది ముర్ము తన చిన్నటి జ్ఞాపకాలను విద్యార్దులతో పంచుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ (Bhubaneswar) లోని రమాదేవీ మహిళా యూనివర్సటీ స్నాతకోత్సంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ భావోద్వానికిలోనయ్యారు. వర్శిటీ క్యాంటీన్ లో తినటానికి డబ్బులు లేక వీధి వ్యాపారుల వద్ద తినేద్దాన్ని అని తెలిపారు. నేను యునివర్శిటీ(University) లో చదువుకుంటున్న సమయంలో ఒక చిరువ్యాపారి నిమ్మకాయలు,మిరపకాయలు,వేరుశెనగ కాయలు 25 పైసలకు అమ్మటం చూశారని అవి ఇప్పటికీ నాకు గుర్తున్నాయని తెలిపారు.
ఒడిశా రాష్ట్రానాకి చెందిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) మయూర్భంజ్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ (Adivasi) గ్రామం నుంచి చదువు కోసం భువనేశ్వర్ వచ్చానని అలా నేను రమాదేశి వర్శిటీలో చదువుకున్నానని తెలిపారు. నా చదువుకు పేదరికం ఎంతో అవరోధాలు కల్పించేది. అయినా విద్యాతో ఉన్నతి సాధించగలమని నమ్మిన నేను చదువు ఆపకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్టడీ కొనసాగించానని చెప్పారు. చిరు వ్యాపారి అమ్మే వేరుశనక్కాయలు (Peanuts ) తినాలని మనస్సులో ఎంతో ఆశగా ఉండేది. కానీ ఆ పావలా (25 పైసలు) కూడా నాదగ్గర ఉండేది కాదు..ఒకవేళ ఉన్నా ఆ పావలా మిగుల్చుకోవటానికి ఇష్టమైన వేరుశెనగకాయలు కొనుక్కోకుండా మనస్సు చంపుకొని అలా ఆకలితో ఉన్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని భావోద్వేగంగా(Emotionally) గురియ్యారు. ఈ యూనివర్శిటీలో నాకు చదువునేర్పిన గురువులకు (teachers) నేను ఎంతగానో రుణపడి ఉంటానని..వారి సహాయ సహకారలతో నేను వర్శిటీ విద్య పూర్తి చేసుకున్నానని రాష్ట్రతి తెలిపారు. వారు నాకు మార్గనిర్ధేశం చేసేవారు అని గుర్తు చేసుకున్నారు. అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదువుకుని ఈరోజు మీముందు ఈ స్థానంలో నిలిచారన్నారు.
కష్టపడి చదువుకుంటే ఎవ్వరైనా ఉన్నతస్థానాలకు చేరుకుంటారని విద్యార్ధులను రాష్ట్రతి ప్రోత్సహించారు. అలాగే లింగ వివక్ష (Gender discrimination) గురించి కూడా ద్రౌపది ముర్ము మాట్లాడుతు..నేను చదవుకునే రోజుల్లో అందరు ఎందుకు ఈ పనికిరాని చదువులు..ఆడపిల్లలు ఎంత చదువు చదువుకున్నా పెళ్లి (wedding) చేసుకోక తప్పదు..రేపు నువ్వు కూడా అంతే పెళ్లి చేసుకోవాల్సిందే..అప్పుడు నీ చదువు ఎందుకు పనికిరాకుండాపోతుంది అంటూ హేళనగా మాట్లాడేవారని తెలిపారు. కానీ చదువు తో సమస్తం సాధ్యమని అన్నారు. ఆ విలువ తెలిసే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆకలిని చంపి మరీ చదువుకున్నానని పాత జ్ఞాపకాలు (old memories ) గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్లడం సంతోషకరమని తెలిపారు. రాష్ట్రపతి ముర్ము చరిత్రలో ఎంతోమంది మహిళలు అసాధ్యం అనుకున్నవి సాధ్యం చేసి చూపించారు. అటువంటి పోరాటాలతో వారి జీవితాలను చక్కదిద్దుకున్నారు. సమాజంలో ఎంతో చైతన్యం తెచ్చిన వీరనారీమణుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని ఆమె సూచించారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరికి పీహెచ్డీ,(Ph.D) 22 మందికి పసిడి పతకాలు అందజేశారు. రెండు రోజులపాటు ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లార్డ్ లింగరాజ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత కటక్ (Cuttack ) లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రెండవ ఇండియన్ రైస్ కాంగ్రెస్(Indian Rice Congress)ను ప్రారంభించనున్నారు.