HYD: మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, సీఐ రాఘవేందర్లకు కంప్లెంట్లు అందజేశారు. మంత్రి బుధవారం తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు తెలిపారు. మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.