Kiara – Sidharth Wedding : కియారా, సిద్ధార్థ్ ఇలా ఒక్కటయ్యారు.. పెళ్లి వీడియో వచ్చేసింది
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ పెళ్లి కాగానే సిద్దార్థ్ ఇంటికి చెక్కేశారు. ఢిల్లీలో రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ఫోటోలను కూడా కొత్త జంట షేర్ చేసింది. ఢిల్లీ రిసెప్షన్ కోసం ఇద్దరూ రెడ్ ఔట్ ఫిట్ లో కనిపించారు
Kiara – Sidharth Wedding : బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ వైవాహిక బంధంతో ఇటీవలే ఒక్కటయిన విషయం తెలిసిందే. అయితే.. వీళ్ల పెళ్లి ఏమో కానీ.. పెళ్లి ఫోటోల కోసం మాత్రం సినీ అభిమానులు తెగ ఎదురు చూశారు. ఇంకెప్పుడు వీళ్ల పెళ్లి ఫోటోలు విడుదల చేస్తారా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. నిజానికి.. వీళ్ల పెళ్లి అతి కొద్ది మంది అతిథుల మధ్య జైసల్మీర్ లో జరిగింది. ఫిబ్రవరి 7న సాయంత్రం కియారా అద్వానీ మెడలో సిద్ధార్థ్ తాళి కట్టాడు. తన మెడలో దండ వేసి తమ ప్రేమకు కామా పెట్టి పెళ్లి బంధానికి వెల్ కమ్ చెప్పారు.
పెళ్లి తర్వాత చాలా సేపటికి పెళ్లి ఫోటోలను ఒక్కొక్కటిగా వదిలారు. తాజాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్ దండలు మార్చుకున్న వీడియోను కియారా, సిద్ధార్థ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి నటించిన షేర్షా మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపం మీదికి చేరుకుంటుంది కియారా. సిదార్థ్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తుంటాడు. లేట్ అవుతోంది అన్నట్టుగా తనకు సైగ చేస్తుంటాడు. ఇంతలో కియారా అక్కడికి వచ్చి అతడిని కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత అతడి మెడలో దండ వేయబోతుంది. కానీ.. సిద్ధార్థ్ అలా తన తలను పైకి అంటాడు. దీంతో తనకు దండ వేయడానికి రాదు. ఆ తర్వాత తన కిందికి వంచడంతో సిద్ధార్థ్ మెడలో తను దండ వేస్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ కూడా కియారా మెడలో దండ వేస్తాడు. దీంతో ఇద్దరూ తమ వివాహ బంధంతో ఒక్కటయినట్టుగా అక్కడున్న అతిథులు చప్పట్లు కొడతారు.
Kiara – Sidharth Wedding : ఢిల్లీకి చెక్కేసిన కొత్త జంట
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ పెళ్లి కాగానే సిద్దార్థ్ ఇంటికి చెక్కేశారు. ఢిల్లీలో రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ఫోటోలను కూడా కొత్త జంట షేర్ చేసింది. ఢిల్లీ రిసెప్షన్ కోసం ఇద్దరూ రెడ్ ఔట్ ఫిట్ లో కనిపించారు. ప్రస్తుతం కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ తమ సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. గోవిందా నామ్ మేరా అనే సినిమాలో కియారా నటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో తెలుగులో ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ. కార్తీక్ ఆర్యన్ తో సత్యప్రేమ్ కి కథా అనే సినిమాలోనూ నటిస్తోంది. సిద్ధార్థ్ ఇటీవల మిషన్ మజ్ను అనే సినిమాలో నటించాడు. రష్మిక మందన్నా అందులో హీరోయిన్. నెట్ ఫ్లిక్స్ లో గత నెలలోనే రిలీజ్ అయింది. యోధా సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే సినిమాలో శిల్పా శెట్టి సరసన సిద్ధార్థ్ నటించనున్నాడు.