కేంద్ర నిఘా సంస్థలు తాజాగా ఉగ్రదాడులపై కీలక హెచ్చరికలు చేశాయి. ముంబై మహానగరంలో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.